వైసీపీ అన్ని రద్దు చేస్తూ రద్దుల ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది. : దేవినేని -| Telugu Rising

Sharing is caring!

సిమెంట్ కంపెనీలతో బేరాలు కుదరకపోవటంతో ఇసుక కొరతను సృష్టించారు…. దేవినేని ఉమా

ఆదివారం ఉదయం విజయవాడ ఆటో నగర్ లోని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం నాడు 100 పైగా ఆవులు మరణించడం బాధాకరమని ఆవుల మరణం పై ప్రభుత్వం వెంటనే స్పందించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న గోసాలను గుర్తించి ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలన్నారు.

టీడీపీ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అందించామని ఇసుక అందుబాటులోకి తీసుకు రాలేక పోవడంతో వైసీపీ ప్రభుత్వ అసమర్థ బయటపడిందని ఒక్కొక్క సిమెంట్ బస్తా కి 5 రూపాయలు ఇవ్వాలని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలను వైసీపీ నేతలు డిమాండ్ చేశారని సిమెంట్ కంపెనీలతో బేరాలు కుదరకపోవటంతో ఇసుక కొరతను సృష్టించారని ట్రాక్టర్ ఇసుక 10 వేలు రూపాయలకు తీసుకువెళ్లారని దుయ్యబట్టారు.

మూడు నెలలు తిరక్కుండానే ప్రభుత్వ విధానాలపై ప్రజలందరూ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు అందరూ రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని టెండర్లు రద్దు వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని ప్రజలు అందరు చర్చించుకుంటున్నారని దేవినేని తెలిపారు.

Sharing is caring!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*