రెండు నెలల పాలనలో ప్రజవేదిక కూల్చడం తప్ప జగన్ చేసిందేంటి….?.-|Telugu Rising

Sharing is caring!

రెండునెలల పాలనలో ప్రజావేదికను కూల్చికాల్చటం తప్ప జగన్ చేసిందేమీ లేదు.. దేవినేని ఉమా

సోమవారం నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం చందర్లపాడులోని మండల తెలుగుదేశంపార్టీ కార్యాలయాన్ని శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు . దేవినేని తోపాటు నందిగామ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య కూడా ఉన్నారు. కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో కాసేపు మాట్లాడిన దేవినేని అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుబాబుల్ రైతాంగానికి 2013 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక ప్రైవేటు కంపెనీ బకాయిపడ్డ డబ్బులలో తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం 76 శాతం చెల్లించిందని దేవినేని తెలిపారు. మిగిలిన 24 శాతం డబ్బులు చెల్లించడం సంతోషదాయకమని కానీ ఎవరి హయాంలో ఈ డబ్బులు రైతులకు ఎవరు బకాయిపడ్డారో ఎవరు చెల్లిస్తున్నారో తెలుసుకోవాలని బురద కార్యక్రమాలు ఆపి రైతులకు న్యాయం చేసే కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో సుబాబుల్ రైతులకు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దిక్కుతోచని స్థితిలో ఆనాడు రైతులు సుబాబుల్ సాగును పూర్తిగా తగ్గించుకోన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ రైతుల పక్షానే పోరాడామని నాటి మా పోరాటాల ఫలితంగా సాగు తగ్గటం వల్ల ప్రముఖ కంపెనీలు కొనుగోలు చేయడం వల్ల సుబాబుల్ కు డిమాండ్ పెరిగి రేటు పెరిగిందని ప్రస్తుతం రైతు చేతికి ఎంత మొత్తం అందుతుందో తెలుసుకోని పూర్తి డబ్బులు రైతుకు అందించే దిశలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.

రెండు నెలల పాలనలో జగన్ పూర్తి వైఫల్యం చెందారని దేవినేని విమర్శించారు. పోలవరం పనులు ఆగిపోయాయని అమరావతి నిర్మాణంతోపాటు ఇబ్రహీంపట్నం ఐకానిక్ బ్రిడ్జ్, వైకుంఠపురం బ్యారేజి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పనులు, వంశధార, గాలేరు-నగరి, హంద్రీనీవా పనులు ఆపేశారని ప్రముఖ కంపెనీలు సైతం జగన్ ప్రభుత్వాన్ని చూసి భయపడి తరలిపోతున్నాయని దేవినేని అన్నారు. ఉచిత ఇసుకను రద్దు చేసి సామాన్యులకు అందుబాటులో ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణ అనుబంధరంగాల కార్మికులను రోడ్డుపై పడేసి తాము మాత్రం అధిక ధరలకు హైదరాబాదుకు ఇసుక తరలిస్తున్నారని దేవినేని విమర్శించారు.

పేద ప్రజల కడుపు నింపే అన్నా క్యాంటీన్ ను ఎందుకు ఆపారో చెప్పాలని, హైదరాబాదులో ఉన్న మన ఆస్తులను కేసీఆర్ కు అప్పజెప్పిన జగన్ ఎలక్షన్లలో తనకు సాయం చేసిన కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి క్విడ్ ప్రోకో కింద ఆంధ్రప్రదేశ్ డబ్బులతో తెలంగాణ భూభాగం మీదకు నీరు తీసుకువెళ్లాలని చూస్తున్నారని ఈ రెండు నెలల్లో జగన్ ప్రజావేదిక కూల్చి కాల్చటం తప్ప సాధించిందేమీ లేదని దేవినేని విమర్శించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త మేకల రామును పరామర్శించిన దేవినేని ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ గడుపూడి చిన్న అప్పయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. మార్గమధ్యంలో ముప్పాళ్ళలో ఆగి కార్యకర్తలతో మాట్లాడారు.

Sharing is caring!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*