పేరుకే మంత్రి పదవులు ఒక్క అధికారి పట్టించుకోరా……?-•|Telugu Rising :: Telugu Rising

Sharing is caring!

ఇది బాబు పాలన కాదు..!

ఏపీ మంత్రికి షాకిచ్చిన విదేశీ ప్రతినిధులు”.

ఏపీలో మంత్రుల మాట అధికారులు వినడం లేదు. మంత్రులను లెక్క చేయడం లేదు. కీలక సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. దాంతో మంత్రులకు… దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. తమకు కేటాయించిన శాఖల్లో.. అధికారులపై..

వ్యవహారాలపై పట్టు సాధించడానికే నానా తంటాలు పడుతున్నారు. అత్యంత కీలకమైన సమావేశాలకు కూడా.. అధికారులు రాకుండా.. చుక్కలు చూపిస్తున్నారు. మీడియా అటెన్షన్ ఉంటుందని తెలిసి కూడా.. కొన్ని సమావేశాలకు కావాలనే డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.శుక్రవారం… ఏపీ విద్యారంగంలో పెట్టుబడులు పెడతామంటూ… ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం వచ్చింది.

ఆ బృందం.. మంత్రి ఆదిమూలం సురేష్‌తో సమావేశమైంది… కానీ మంత్రి వద్ద కనీస సమాచారం లేదు. ఒక్క అధికారీ భేటీకి రాలేదు. దాంతో.. మంత్రికి ఆస్ట్రేలియా బృందంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు.విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధి బృందం ఇటువంటి సమన్వయలోపంతో మంత్రికి చేదు అనుభవం ఎదురవ్వడంతో అక్కడున్న మీడియా, ఇతర అధికారులు అవాక్కయ్యారు. చివరకు మంత్రి ఎలాకొలా మేనేజ్ చేయటంతో డెలిగేట్స్ తో మీటింగ్ అయ్యిందని అనిపించారు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఎందుకిలా జరిగిందంటూ.. ఓఎస్డీపై మండిపడ్డారు. అయితే.. అసలు విషయం మాత్రం.. మంత్రులు పాలనపై పట్టు సాధించలేకపోతున్నారని అంటున్నారు. ఈ కోపం అంతా.. తనకు ప్రభుత్వం ఓఎస్డీగా నియమించిన శ్రీనివాసరెడ్డి అనే అధికారిపై చూపించారు. ఎజెండా ఏదీ..? సమాచారం ఎక్కడ..? అధికారులు ఏమయ్యారని… అసహనం వ్యక్తం చేశారు.కనీస సమాచారం లేకుండా నేను వాళ్లతో ఏం మాట్లాడాలనేది మంత్రి సురేష్ ఆవేదన.

ఎంత సేపు ఎదురు చూసినా..అధికారులు మాత్రం రాలేదు. ఉన్నతాధికారులు… మొత్తం.. మంత్రులకు రిపోర్ట్ చేయడం కన్నా.. నేరుగా.. పెద్దలకు రిపోర్ట్ చేసుకుంటనే తమకు ఫ్యూచర్ ఉంటుందన్న రీతిలో ఉంటున్నారంటున్నారు. చంద్రబాబు పాలనలో… ఇలా లేదని గొణుక్కుంటూ.. ఆసీస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.

Sharing is caring!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*