నెల్లూరు లో మరోసారి రౌడీయిజం చేసిన ఎమ్మెల్యే….-| Telugu Rising

Sharing is caring!

నెల్లూరులోని జమీన్ రైతు పత్రిక సంపాదకులు డొలేంద్ర ప్రసాద్ పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అనుచరులతో కలసి ఇంటికి వెళ్లి దాడి చేశారు.. అసభ్యకరమైన మాటలతో దూషించి, పోలీసులకు చెప్తావా ? జగన్ కు చెప్తావా ? అంటూ బెదిరిం చారు కోటంరెడ్డి..

దశాబ్దాల కాలంపాటు నెల్లూరు ప్రజల మానసపుత్రికగా వెలుగొందుతున్న సంచలనాల చిన్న పత్రిక జమీన్ రైతుపై దాడిచేయటమంటే జిల్లాలో వైకాపా రౌడీ పాలన ఏలా సాగుతుందో అర్థమౌతుంది..

గతంలోనూ ఒక సాధారణమైన రిపోర్టర్ ను చంపుతానని కోటంరెడ్డి ఫోన్ లో బెదిరించిన విషయం విదితమే..

గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు ఎవరైనా నోరుపారేసుకుంటే ప్రజాస్వామ్య విలువల గూర్చి ఏకరువు పెట్టిన కోటంరెడ్డి ఎమ్మెల్యే అవ్వగానే భౌతిక దాడులకు పాల్పడటం ఏలాంటి ప్రజాస్వామిక విలువలో అర్దమవుతుంది..

డొలేంద్రపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విచారించి తక్షణం శ్రీధర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని పత్రికా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..

పాత్రికేయులపై పైశాచికత్వానికి కోటంరెడ్డి ఆది కాదు, అంతమూ కాదని మీడియా సంస్థలు పెరొన్నయి..

కలాలను కాళ్ళతో తన్నిన వాళ్ళకు చరిత్రలో ఏ గతి పట్టిందో కోటంరెడ్డికి అదే గతి పడుతుందని హెచ్చరించాయి..

Sharing is caring!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*