నవరత్నాలలో ఊడిపోయిన మొదటి రత్నం.. 45 ఏళ్లకే పెన్షన్ తుస్..-| Telugu Rising.

Sharing is caring!

మాట తప్పుడు…మడమ తిప్పుడు – 1

45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ,బీసీ మహిళలకు పింఛను హామీ తూచ్ అనేసిన జగన్

అధికారం చేపడుతూనే తాను ప్రభుత్వ ప్రాధమ్యాలు అవినీతిరహిత పాలన, విశ్వసనీయత అని ప్రకటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రెండు నెలలు గడిచేలోగా ఈ రెండు మచ్చుకు టార్చ్ లైట్ వేసినా కనపడకుండా చేయడంలో విజయవంతమయ్యారు వైఎస్ జగన్. మాట తప్పుడు..మడమ తిప్పుడు ఆరంభమైంది. పాదయాత్రలో 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛను ఇస్తామని ప్రకటించారు. అప్పట్లో ఈ అంశం అన్ని పత్రికలలో చానళ్లలోనూ ప్రసారమైంది. సాక్షి చానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు అయితే ఈ 45 ఏళ్ల పింఛనుపై జగన్తో చేసిన ఇంటర్వ్యూలో అనుమానం కూడా వ్యక్తం చేశారు. తానెందుకు ఈ పింఛను ఇవ్వాలనుకుంటున్నానో, కొమ్మినేనికి వివరించారు జగన్. “ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏదైనా జ్వరం వచ్చి వారం రోజులపాటు పనులకు పోకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి. వారికి తోడుగా ఉండేందుకే 45 ఏళ్లకే పింఛను ఇవ్వాలనుకుంటున్నాను“ అని చెప్పారు. జగన్ ఇచ్చిన హామీని నమ్మిన ప్రజలు..తమకూ వర్తింపజేయాలని చాలా ప్రాంతాల నుంచి కోరారు. పాదయాత్ర ముగిసింది. పదవీయాత్ర ప్రారంభమైంది. ఒక్కో రత్నం రాల్చుకుంటూ వస్తున్నారు. తాజాగా 45 ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛను రత్నం హామీగానే సమాధి అయిపోయింది. దీనిపై నిలదీసిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని సస్సెండ్ చేసి మరీ, తమ మాట తప్పుడు, మడమ తిప్పుడు ఇలాగే ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా నిరూపించారు సీఎం జగన్.

Sharing is caring!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*