జగన్ అంటే కంపెనీలకు ఎందుకు అంత భయం…?-| Telugu Rising :: Telugu

Sharing is caring!

జగనన్న వచ్చాడు..పారిపోండ్రోయ్..

– ఏపీ నుంచి తరలిపోతున్న కంపెనీలు..

– విశాఖలో కార్యకలాపాలు నిలిపేయనున్న ఐబీఎం..

– తమిళనాడుకు తరలిపోతున్న కియా అనుబంధ పరిశ్రమలు..

జగనన్న అడుగెడితే మాస్.. మ..మ..మాస్ అంటూ పారిపోతున్నాయి కంపెనీలు…

కొత్తగా రావాల్సిన కంపెనీల సంగతి దేవుడెరుగు..ఉన్నవన్నీ తమిళనాడుకు, కర్ణాటకకు తట్టాబుట్టా సర్దే పనిలో ఉన్నాయి. ..

కియా దాని అనుబంధ పరిశ్రమలతో మొదలైన ఈ తరలింపులు విశాఖ ఐబీఎం వరకూ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి…

జగన్ గెలిచిన వెంటనే అమరావతిపై నీలినీడలు కమ్ముకున్నాయి…

ఆ అనుమానాలను నిజం చేస్తూ రాజధాని పనులు నిలిపేయడంతో నిర్మాణ రంగ కంపెనీలన్నీ బిచాణా ఎత్తేశాయి…

వేలాది మంది కూలీలు రోడ్డున పడ్డారు. వందల కోట్ల నిర్మాణాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ..

మరో వైపు బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చే రహస్య ఒప్పందం జగన్ చేసుకున్నారని, దీంతో ప్రస్తుతం జరుగుతున్న పనులు నిలిపేయాలని మౌఖిక ఆదేశాలందాయని జోరుగా ప్రచారం సాగుతోంది…

దీనికి ఊతమిచ్చేలా బందరు పోర్టు పనులు చేపట్టిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ తమ భారీ యంత్రాలను తరలించుకుపోయింది…

టీడీపీ హయాంలో ఎంతో వ్యయప్రయాసలకోర్చి అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను చంద్రబాబు తీసుకొచ్చారు…

కియాతోపాటు దానికి అనుబంధంగా విడిభాగాలు అందించే పలు సంస్థలు తమ కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంది…

అయితే జగన్ ప్రభుత్వం వచ్చీరావడంతోనే వైకాపా నేతలు కియా యాజమాన్యాన్ని వివిధ రకాలుగా బెదిరించారని తెలిసింది…

దీంతో తమ అనుబంధ పరిశ్రమలన్నింటినీ కర్ణాటకలో స్థాపించేందుకు కియా ఏర్పాట్లు చేసుకుంటోంది..

ఐటీ హబ్ గా విశాఖ తీర్చిదిద్దేందుకు ఎన్నో కంపెనీలను ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ తీసుకొచ్చారు…

హైదరాబాద్ కి ధీటుగా విశాఖ ఐటీ కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకునే లోపే జగన్ సర్కారొచ్చింది…

ఒక్కో కంపెనీ పక్క రాష్ర్టాల వైపు చూస్తోంది. కారణాలేంటో తెలియకపోయినా విశాఖ నుంచి చాలా ఐటీ కంపెనీలు తరలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి…

ఐబీఎం వంటి ప్రఖ్యాత సంస్థ కూడా ఈ జాబితాలో ఉంది.

జగనన్న అంటే కంపెనీలకు ఎందుకింత వణుకు? పారిశ్రామికవేత్తలు ఎందుకు పారిపోతున్నారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్…

ఈ కంపెనీలన్నీ జగన్ క్విడ్ ప్రోకో వ్యవహారాలను అధ్యయనం చేశాయని.. ఆ స్థాయి మనిషితో తాము వేగలేమని ఒక నిర్ణయానికి వచ్చి ఏపీ నుంచి జెండా ఎత్తేస్తున్నారని సమాచారం.

Sharing is caring!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*