గోమాత ల మృత్యువాత రాష్ట్రానికి అరిష్టమా…?….-| Telugu Rising:Telugu

Sharing is caring!

వందల గోమాతల మృత్యు ఘోషతో ఆంధ్రప్రదేశ్ కి అరిష్టం

– గోహత్య పంచమహాపాతకాలలో ఒకటి

– బ్రహ్మహత్యతో గోహత్య సమానం

– అతివృష్టి, అనావృష్టి తాండవించే అవకాశం

– పట్టించుకోని క్రైస్తవ ముఖ్యమంత్రి జగన్

– వందల గోవుల మరణంపై స్పందించని ఏపీ బీజేపీ, మఠాధిపతులు, స్వాములు

– గోశాల వద్ద తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక్కడే ఆందోళన

– గోవుల మృత్యువాతపడిన గోశాల పక్కనే ఉన్నా పట్టించుకోని స్వామీజీలు

– టీడీపీ హయాంలో 17 గోవులు చనిపోతే ఆందోళనకు దిగిన స్వాములు

ఆంధ్రప్రదేశ్ లో హిందూ ధర్మం పెను ప్రమాదంలో పడింది. రెండు నెలల క్రితం క్రైస్తవ ముఖ్యమంత్రి అధికార పీఠం చేజిక్కించుకోవడంతో ఆరంభమైన అరాచక అపచార పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వందల గోమాతల మృత్యు ఘోషతో ఆంధ్రప్రదేశ్ కి అరిష్టం చుట్టుకోనుందని పండితులు ఆందోళన చెందుతున్నారు. పంచమహాపాతకాలలో గోహత్య ఒకటి.

పంచ మహాపాతకాలు అంటే

1. స్త్రీ హత్య – స్త్రీని చంపడం

2. శిశు హత్య – చిన్నపిల్లలను చంపడం

3. గో హత్య – ఆవును చంపడం

4. బ్రహ్మ హత్య – బ్రాహ్మణున్ని చంపడం

5. గురు హత్య – చదుఫు నేర్పిన గురువుని చంపడం

పంచమహాపాతకాలలో ఒక్కటైన గోహత్యను గోశాల ముసుగులో అత్యంత దారుణంగా చేయడం హిందువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయవాడ తాడేపల్లి కొత్తూరు గోశాల నిర్వాహకుల మధ్య వివాదాలో,పొరపాటో కానీ వందకు పైగా గోవులు చనిపోయాయి. వారి స్వార్థం కోసం చేసినా, కక్షతో మూగజీవాలైన గోవుల ప్రాణాలు తీసినా..అది చిట్టచివరికి రాష్ర్టానికి అరిష్టంగా చుట్టుకుంటుందని వేదపండితులు, ధార్మికవేత్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇస్కాన్ ప్రచారకులు రాధా మనోహర్ దాస్ గోవుల మరణంపై తీవ్రంగా స్పందించారు. ఇది మానవజాతికి తీరని అరిష్టమని, ముఖ్యమంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మలగన్నఅమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ సన్నిధికి సమీపంలో, తెలుగు రాష్ర్టాల్లోనే అత్యంత ప్రభావశీలురైన అధికార పీఠాలకు దగ్గరైన స్వామీజీల ఆశ్రమాలకు అత్యంత సమీపంలో ఈ గోవులు నిర్జీవులుగా మారాయి.

విజయవాడ శివార్లలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో రాత్రికి రాత్రి 101 ఆవులు మరణించడం వెనుక అసలు కారణాలు ఏమైనా కావొచ్చు. కానీ ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం చేయనుందనే ఆందోళన ఇప్పుడు ధార్మిక సంఘాల నుంచి వినిపిస్తోంది. అనారోగ్యంతోనో, ప్రమాదవశాత్తో, సహజమరణంగా గోవులు చనిపోతే..దోషం ఉండదు. కేవలం గోమాతలను పూజించే నెపంతో, రక్షించే నెపంతో కొందరు ట్రస్టుగా ఏర్పడి వందల కోట్ల విలువైన భూముల్లో 2 వేలకు పైగా గోమాతలను సంరక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గోశాలలో జరిగిన దారుణం ఇది. కోట్ల ఆస్తులలో, లక్షల విరాళాలతో నడుపుతున్న గోశాలలో వంద రూపాయల మంచి గడ్డి పెట్టలేరా? ఇది వారికి సమస్యే కాదు. గోశాల ట్రస్టు సభ్యుల మధ్య ఆధిపత్య పోరే వందల గోవుల మరణ ఘోషకు కారణమని తెలుస్తోంది. అంటే పంచమహాపాతకాలలో ఒకటి అయిన గోహత్య జరిగింది. బ్రహ్మ హత్యాపాతకంతో సమానమైన ఆవులను హత్య చేశారు. గరుడ పురాణంలో గోహత్యలు (ప్రాణులు, పశుపక్ష్యాదులు) చంపి తాము బతికేవారికి రౌరవం, కుంభీపాక నరకం అను నరక ప్రాప్తి తప్పదని ఉంది. దీంతోపాటు అరిష్టం చుట్టుకుంటుందని పురాణాలలో ఉంది. ప్రభుత్వం గోవులు విషాదంపై ఓ కమిటీ వేసింది. డీజీపీ గారు సిట్ వేస్తున్నట్టు ప్రకటించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. కానీ ఆ కాళరాత్రి గోవుల అరుపులు, చావుతో పోరాడిన గోమాత ఉసురు రాష్ట్రానికి తప్పక తగులుతుందని కొందరు పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడకు సమీపంలోని తాడేపల్లి కొత్తూరు గోశాల వద్ద ఇంత విషాదం జరిగినా, ఆ సమీపంలోని ఆశ్రమాలలో ఉన్న ఒక్క స్వామీజీ అయ్యో పాపం అన్న పాపాన పోలేదు. ఆంధ్రప్రదేశ్ లోని ధార్మికసంఘాలకు గోహత్య మహాపాతకం అని చెప్పాలని కూడా అనిపించలేదు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం గొంతు చించుకునే ఏ ఒక్క గొంతూ పెగలడంలేదు. అత్యంత దారుణంపై ఒకే ఒక్కరు స్పందించారు. ఆయనే తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గోశాలలో పెద్దసంఖ్యలో గోవులు మృతి చెందటం వెనుక కుట్రకోణం దాగి ఉందని రాజాసింగ్ ఆరోపించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ మాధవ్‌ ఉన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని… ఇందుకు కారణమైన కుట్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాంతి హోమం జరిపితే మంచిదని సూచించారు. అయితే బీజేపీ నామ్ కే వాస్తే గోశాల సందర్శనను పక్కనబెడితే, స్వామీజీలు, సన్యాసులు, మఠాధిపతులు తాడేపల్లి, సీతానగరం చుట్టూ పదుల సంఖ్యలో ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా అయ్యో పాపం ఏంటీ దారుణం అని అడగలేదు. ఈ స్వామీజీలే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడ పాతబస్తీలోని గోశాలలో ..

కాలం తీరిన బొంబాయి రవ్వ ఓ దాత పెట్టడంతో 17 ఆవులు చనిపోతే ఏకంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో ఆందోళనలు కొనసాగించారు. ఒక స్వామీజీ అయితే ఏకంగా నిరసన దీక్షకే దిగారు. ఆ స్వామీజీకి ఇప్పుడు వందకు పైగా గోవులు విషప్రయోగంతో చనిపోయాయని తెలియదా? లేదంటే తెలిసి మౌనంగా ఉన్నారా అనేది జవాబు దొరకని ప్రశ్న అయిపోయింది. గోవుల మరణంతో రాష్ర్టానికే అరిష్టం అని శాస్ర్తాలు ఘోషిస్తున్నా.. పట్టించుకునే పాలకులు లేరు. హెచ్చరించే స్వామీజీలు కానరారు. గో సంరక్షణ చట్టాలు తెచ్చిన బీజేపీ వారికి ఎందుకో ఇది సమస్యగా అస్సలు కనిపించడం లేదు. పార్టీలకు అతీతంగా ధార్మిక సంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలు ముందుకొచ్చి గోమాతల మృత్యు ఘోషతో ఆంధ్రప్రదేశ్ పొంచివున్న అరిష్టం ముప్పు నుంచి కాపాడే శాంతి హోమాలు చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Sharing is caring!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*