కేశినేని భవన్ కాలి చేయడం పై నాని ఆసక్తికరమైన ట్వీట్….-| Telugu Rising:Telugu

Sharing is caring!

టీడీపీ విజయవాడ అర్బన్‌ కార్యాలయాన్ని కేశినేని భవన్‌ నుంచి ఖాళీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుమతితో అర్బన్‌ కార్యాలయాన్ని కేశినేని భవన్‌ నుంచి తాత్కాలికంగా ఆటోనగర్‌ గురునానక్‌ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయానికి మార్చినట్టు టీడీపీ అర్బన్‌ ప్రధాన కార్యదర్శి కొమ్మా రెడ్డి పట్టాభిరామ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్బన్‌ టీడీపీ సొంత కార్యాలయం ఏర్పాటయ్యే వరకు అర్బన్‌ నేతల సమావేశాలు, పార్టీ కార్యక్ర మాలను జిల్లా పార్టీ కార్యాలయం నుంచే నిర్వహించనున్నట్టు వివ రించారు. ఇక నుంచి తనతో పాటు అర్బన్‌ అధ్యక్షుడు బుద్దా వెంక న్న, కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ నాయకులు పార్టీ జిల్లా కార్యాల యంలో అందుబాటులో ఉంటారని పట్టాభిరామ్‌ తెలిపారు.

నగర పరిధి లోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల నాయకులు, ఆయా డివిజన్ల అధ్య క్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్త లు, శ్రేణులు ఈ మార్పును గమనించి అర్బన్‌ పార్టీ కార్యక్రమాలను జయప్ర దం చేసేందుకు సహకరించాలని కోరారు. టీడీపీ అర్బన్‌ కార్యాలయాన్ని కేశినేని భవన్‌ నుంచి ఖాళీ చేయడంపై ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) ట్విట్టర్‌ వేది కగా స్పందించారు. ‘‘లెస్‌ లగేజ్‌ మోర్‌ కంఫర్ట్‌’’ (తక్కువ సామాను, మరింత సౌకర్యం) అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కేశినేని భవన్‌ నుంచి టీడీపీ అర్బన్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయడం తనకే మంచి దన్నట్టు ఎంపీ కేశినేని పోస్టు చేసిన ట్వీట్‌ టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత దూరం

ఎంపీ కేశినేని నాని వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన టీడీపీని వదిలి బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. కానీ తాను పార్టీ మారబోనని, టీడీపీలోనే కొనసాగుతూ తన అభిప్రాయాలను నిర్మొ హమాటంగా వెల్లడిస్తానని స్పష్టం చేశారు. అందుకనుగుణంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు లోక్‌సభలో టీడీపీ విప్‌ పదవిని ఇవ్వగా.. ఎంపీ తిరస్కరించారు. అంత పెద్ద బాధ్యతను తాను నిర్వహించలేనని, వేరొకరికి ఆ పదవిని అప్పగించాలని ఫేస్‌బుక్‌ ద్వారానే అధినేత చంద్రబాబుకు సమాధానమివ్వడం అప్పట్లో చర్చనీ యాంశమైంది. ఇటీవల కశ్మీర్‌ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ సమర్థించగా.. ఎంపీ నాని స్పందిస్తూ కశ్మీరుపై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కశ్మీరుకు, దేశాని కి మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో కాలమే సమాధానం చెప్పా లని ఆయన ట్వీట్‌ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు, బంద రు పోర్టు పనులను రద్దు చేస్తూ జీవో జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంటే.. ఎంపీ మాత్రం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందిస్తూ ‘‘సీఎం జగన్‌ గారూ.. మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థి స్తాను. కానీ బందరు పోర్టును తెలంగాణకో, వాన్‌పిక్‌కో.. లేక ఇతర ప్రైవేటు వారికో ధారా దత్తం చేయకుండా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకుని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఎంపీ నాని వ్యవహారశైలి పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన ప్పటి నుంచి పార్టీలో ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ… పార్టీ నాయకులను రెచ్చగొట్టి తనపై చర్యలు తీసుకునేలా చేసి పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎంపీ కేశినేనిపై కొందరు టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Sharing is caring!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*